Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 647కి చేరిన కరోనా కేసులు..

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (11:42 IST)
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నిర్థారణ కేసుల సంఖ్య 647కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కొవిడ్‌-19కారణంగా ఇప్పటివరకు మొత్తం 13మంది మృతి చెందినట్లు ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 43మంది కోలుకోగా 593మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 
 
మహారాష్ట్రలో అత్యధికంగా 124కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఒకరు కోలుకోగా మరో ముగ్గురు మరణించారు. కేరళలో ఈ కేసుల సంఖ్య 118కి చేరగా వీరిలో నలుగురు కోలుకున్నారు. ఇక తెలంగాణలో 41కేసులు, ఏపీలో 11 కేసులు, గోవాలో మూడు కరోనా వైరస్‌ కేసులు, కాశ్మీర్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. 
 
హైదర్‌పోరా గ్రామంలో కొవిడ్‌-19 కారణంగా 65ఏళ్ల వ్యక్తి మరణించినట్లు కాశ్మీర్‌ వైద్య అధికారులు వెల్లడించారు. అనంతరం ఈ వ్యక్తి కుటుంబంలోని నలుగురికి కూడా వైరస్‌ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా సాయం చేస్తామని శ్రీనగర్‌ మేయర్‌ జునైద్‌ అజీం ట్విట్టర్‌లో తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments