Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీజనల్‌ వ్యాధిగా కరోనా?

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (10:10 IST)
కరోనా మహమ్మారి కూడా సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది.

కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఐరాస అధ్యయనం చేపట్టింది. కొన్ని వేడి ప్రాంతాల్లోనూ ఈ మహమ్మారి విజఅంభించిందని, వచ్చే ఏడాది ఇలా జరగదు అని చెప్పడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

అత్యంత చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు కరోనా వైరస్‌ ఎక్కువ కాలం మనుగడ సాగిస్తున్నట్లు గుర్తించామని ఐరాస తెలిపింది.

అయితే వైరస్‌ వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది.
 
శ్వాసకోశ ఇబ్బందులు, వైరల్‌ ఇన్ఫెక్షన్లు సీజనల్‌గా వస్తుంటాయని నిపుణుల బఅందం వెల్లడించింది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజఅంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కలిగించే కరోనా వైరస్‌ వ్యాప్తి ఉంటుందని, ఇదే విధంగా కొన్ని సంవత్సరాల పాటు సాగితే కరోనా కూడా సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

మాస్కులు, ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి చర్యల ద్వారా కరోనా వ్యాప్తిని అడ్టుకట్ట వేయగలిగామని తెలిపింది. వాతావరణ అంశాల ఆధారంగా ఆంక్షలను సడలించవద్దని ప్రపంచదేశాలను హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం