Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై కానిస్టేబుల్ - గ్రామపెద్ద గ్యాంగ్ రేప్... బాధితురాలి తండ్రి హఠాన్మరణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహిళలపై జరుగుతున్న నేరాలకు, ఘోరాలకు అడ్డాగా మారుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కామంతో కళ్లుమూసుకునిపోయిన కానిస్టేబుల్ ఆ గ్రామ పె

Cop
Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2017 (12:15 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహిళలపై జరుగుతున్న నేరాలకు, ఘోరాలకు అడ్డాగా మారుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కామంతో కళ్లుమూసుకునిపోయిన కానిస్టేబుల్ ఆ గ్రామ పెద్దతో కలిసి 15 యేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని తట్టుకోలేక బాధితురాలి తండ్రి హఠాన్మరణం చెందాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్త‌రప్ర‌దేశ్ రాష్ట్రంలోని బాల్లియాకు సమీపంలోని రియోటి ఏరియాలో నివశించే 15 ఏళ్ల బాలిక శుక్ర‌వారం రాత్రి బ‌హిర్భూమికి ఒంటరిగా వెళ్లింది. ఆ సమయంలో మాటువేసిన కానిస్టేబుల్, గ్రామ పెద్ద కలిసి ఆ బాలికను అత్యాచారం చేశాడు. త‌న‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాన్ని ప్ర‌తిఘ‌టించిన బాలిక‌... గ‌ట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టు ప‌క్క‌ల ఉన్న స్థానికులు అక్క‌డికి చేరుకునే లోపేనిందితులు పారిపోయారు. 
 
త‌న కూతురు పై అత్యాచారం జ‌ర‌గ‌డాన్ని జీర్ణించుకోలేని బాలిక తండ్రి అక్క‌డికక్క‌డే గుండె ఆగి మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, గోపాల్ న‌గ‌ర్ ఔట్ పోస్ట వ‌ద్ద పని చేస్తున్న నిందితుడు పోలీస్ కానిస్టేబుల్‌‌ని స‌స్పెండ్ చేసి అనంత‌రం అరెస్ట్ చేశారు. మైన‌ర్ బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డినందుకు ఐపీసీ సెక్ష‌న్ 354, 306, పొస్కో యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. పరారీలో ఉన్న గ్రామ పెద్ద కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం