కాంగ్రెస్ కురువృద్ధుడు మోతీలాల్ ఓరా కన్నుమూత

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (16:58 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన కురువృద్ధ నేతల్లో ఒకరైన మోతీలాల్ ఓరా ఇకలేరు. 93 యేళ్ళ వయసులో ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా. 
 
గత కొంతకాలంగా మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఓరాను కొద్దిరోజుల క్రితం ఓక్లాలోని ఎస్కాట్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు కరోనా వైరస్ కూడా సోకింది. అయితే, ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అయినప్పటికీ శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
అయితే, ఆదివారం నాటికి 93 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆయన.. పుట్టినరోజు తెల్లారే తుదిశ్వాస విడవడం గమనార్హం. 1927 డిసెంబర్ 20న మోతీలాల్ ఓరా జన్మించారు. రెండుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 
 
తొలుత సమాజ్వాదీ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఓరాకు పేరుంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సుధీర్ఘకాలం కోశాధికారిగా కూడా పని చేశారు. 
 
కాగా, ఇటీవల తరుణ్ గొగోయ్, అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు వరుసగా కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments