Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు? ఆజాద్ ఇంటికి నేతల క్యూ!!

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (19:58 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. అంతర్గత కుమ్ములాటల కారణంగా అధికారంలో ఉన్న పంజాబ్‌ హస్తం చేజారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా నామమాత్రపు ప్రభావాన్నే చూపించింది. దీంతో ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. 
 
దీనికి కారణం ఎవరు అంటూ కాంగ్రెస్ పార్టీ మథనం మొదలైంది. ఇంతటి ఘోర పరాజయానికి కారణం ఎవరు? అంటూ పార్టీలోని సీనియర్ నేతలు వరుసగా తమ గళం విప్పుతున్నారు. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ బుధవారం చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చుకోలేని సంకటస్థితిలోకి వెళ్లిపోయింది. 
 
ఇదిలావుంటే, ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ఇంటికి బుధవారం సాయంత్రం అనేక మంది సీనియర్ నేతలు క్యూకట్టడం దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కపిల్ సిబల్ కూడా గులాం నబీ ఆజాద్ ఇంటికి వెళ్లారు. 
 
అలాగే, సీనియర్ నేతల మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ, శశిథరూర్, మణి శంకర్ అయ్యర్, పీజే కురియన్, పరిణీత్ కౌర్, సందీప్ దీక్షిత్, రాజ్ బబ్బర్, భూపిందర్ సింగ్ హుడా ఇలా మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. 
 
వీరంతా ఒక్కసారిగా గులాం నబీ ఆజాద్ ఇంటికి క్యూకట్టడానికి కారణం ఏమై ఉంటుందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలోనేకాదు దేశ రాజకీయాల్లోనూ మొదలైంది. మొత్తంమీద సీనియర్ నేతల వైఖరిని చూస్తుంటే మునుపెన్నడూ చోటుచేసుకోని పరిణామం ఏదో జరగడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments