Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రాహ్మణ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాననీ ఎవరు చెప్పారు: రాహుల్ గాంధీ

బ్రాహ్మణ వర్గానికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నాననీ ఎవరు చెప్పారనీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తనకు కులమతాల పట్టింపు లేదన్నారు. వాటికి ప్రత్యేకంగా మద్దతు తెలపడం అన్నది లేదన్నారు

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (18:19 IST)
బ్రాహ్మణ వర్గానికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నాననీ ఎవరు చెప్పారనీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తనకు కులమతాల పట్టింపు లేదన్నారు. వాటికి ప్రత్యేకంగా మద్దతు తెలపడం అన్నది లేదన్నారు. అందరినీ సమానంగా చూస్తానన్నారు. 
 
గుడిసెలోకి, గుడిలోకి వెళ్లడంలో పెద్ద తేడా చూపించనన్నారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో కూడా టీ తాగుతానని, తనకు అంతా సమానమేనని తెలిపారు. అయితే పార్టీ సీట్ల కేటాయింపు విషయంలో తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోనని, అందులో పలువురి ప్రమేయం ఉంటుందని ఆయన చెప్పారు.
 
ప్రధానంగా ప్రస్తుతం తాను చేస్తున్న కిసాన్ ర్యాలీ కులమతాలకు అతీతమైనదన్నారు. దేశవ్యాప్తంగా రైతులు సమస్యల్లో ఉండగా, కేవలం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే కిసాన్ ర్యాలీ నిర్వహించడంలో ఉద్దేశ్యం త్వరలో యూపీలో ఎన్నికలు జరగనుండటమేనా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను కేవలం యూపీలోనే కిసాన్ ర్యాలీ నిర్వహించాలని భావించలేదని, దేశ వ్యాప్తంగా ర్యాలీ చేయాలా? లేక ఏదో ఒకరాష్ట్రంలో ర్యాలీ తీయాలా? అని అడిగారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments