Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకాల ఎగుమతులపై నిషేధించాలి : ప్రియాంకా గాంధీ

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:45 IST)
దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో రోగులకు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 
 
అలాంటి వారిలో ప్రియాంకాం గాంధీ ఒకరు. ఆమె కేంద్ర ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో త‌యారైన వ్యాక్సిన్ల‌ను ముందుగా దేశ ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌కుండా విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తుండ‌డం స‌రికాద‌ని అన్నారు. ఆరు నెలల్లో విదేశాలకు 11 లక్షల రెమ్‌డిసివిర్ ఔష‌ధాన్ని ఎగుమతి చేశారని ఆమె విమర్శించారు.
 
అలాగే, జనవరి నుంచి మార్చి మధ్య ఆరు కోట్ల క‌రోనా వ్యాక్సిన్ల‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, దీంతో దేశంలో వాటి కొర‌త ఏర్పడిందని అన్నారు. విదేశాల‌కు వాటిని ఎగుమతి చేయక‌పోతే దేశంలో మ‌రి కొన్ని కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్లు అందేవ‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం దేశ ప్ర‌జ‌ల‌కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వ‌ట్లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు.
 
ప్ర‌ధాని మోదీ ఎన్నికల ర్యాలీల్లో నవ్వుతూ మాట్లాడటం కాదని, ప్రజల ముందుకు వ‌చ్చి, వారి ముందు కూర్చుని మాట్లాడాల‌ని, ప్ర‌జ‌లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో వారి ప్రాణాలను ఎలా కాపాడతారో వారితో చర్చించి నమ్మకం కల్పించాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments