Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీకి సిన్సియర్‌గా పని చేస్తుంటే.. నాపై విమర్శలు చేస్తారా : సోనియాకు శశిథరూర్ లేఖ

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2015 (11:29 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వైఖరిని ఆమె ప్రధాన అనుచరుల్లో ఒకరైన కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ కోసం సిన్సియర్‌గా సేవ చేస్తుంటే, దాన్ని గుర్తించడం లేదు సరే తనపై విమర్శలు చేస్తారా అంటూ ఘాటైన లేఖను అధినేత్రికి రాసి అందరికీ షాక్ ఇచ్చారు. 
 
ఇటీవల బ్రిటిష్ పాలనపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ప్రసంగించిన శశి థరూర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించిన విషయంతెల్సిందే. ఆ తర్వాత ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో శిశిథూరర్‌పై సోనియా మండిపడ్డారు. పార్లమెంటులో కాంగ్రెస్ వ్యూహాలను ముందుగానే ఆయన బయటకు వెల్లడించారన్నవార్తల నేపథ్యంలో, సోనియా ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో శశి థరూర్ లేఖ రాయడం, అందులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్టీలో తనను ఒంటరిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై తన నిబద్ధతను అపార్థం చేసుకుంటున్నారని, తన శక్తిమేరకు కృషి చేస్తున్నప్పటికీ, ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. తాను పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని వీడి మోడీ చెంతకు చేరాలన్న ఉద్దేశ్యంతోనే శశిథరూర్ చేసినట్టుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments