Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్ఞాతవాసం వీడి ఢిల్లీకి రానున్న రాహుల్ గాంధీ!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (09:45 IST)
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా అజ్ఞాతవాసం గడుపుతున్నారు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారనే అంశం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై నిఘా వర్గాలు సైతం ఆరా తీసినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వచ్చే వారం ఢిల్లీ రానున్నట్టు తాజాగా సంకేతాలు వెలువడ్డాయి. 
 
వాస్తవానికి పార్టీలోని అన్ని స్థాయిల్లో సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీనికి పార్టీ అధిష్టానం ససేమిరా అనడంతోనే సెలవుపై వెళ్లి ఎంతకీ తిరిగిరావట్లేదట. అత్యంత కీలకమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సైతం డుమ్మా కొట్టారు కూడా. ఈ సెలవు గడవు ముగిసినా ఆయన జాడ లేదు. ఢిల్లీకి వచ్చాక మాట్లాడుకుందామంటూ అధిష్టానం చేసిన ఆపర్‌ను సైతం ఆయన తిరస్కరించారు. 
 
సంస్థాగత ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటిస్తే కాని తిరిగివచ్చేది లేదని రాహుల్ తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో అధిష్టానం దిగొచ్చింది. మే 15 నుంచి సెప్టెంబర్ 30లోగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. దీంతో శాంతించిన రాహుల్ గాంధీ అజ్ఞాతాన్ని వీడేందుకు సమ్మతించారు. వచ్చే వారంలో ఆయన ఢిల్లీలో వాలిపోతారట. వచ్చీరాగానే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన ఉవ్వళ్లూరుతున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments