Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ ఆస్తుల జప్తుకు కర్ణాటక చర్యలు.. సమ్మతించిన సీఎం పళనిస్వామి?

ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ఆస్తుల జప్తునకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమిళనాడు ముఖ్

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (11:11 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ఆస్తుల జప్తునకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి సైతం ఓకే చెప్పడం గమనార్హం. 
 
మరోవైపు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించే దిశగా ముఖ్యమంత్రి ఎడప్పాడి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంలు పావులు కదపుతున్నారు. ఇందులోభాగంగా, వచ్చేనెల 15వ తేదీన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. 
 
ఇలా, అన్నాడీఎంకే పదవి నుంచి శశికళను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం ఆమెతో పాటు.. ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న ఇళవరసి, సుధాకరన్ ఆస్తులను కూడా జప్తు చేసేందుకు చర్యలు చేపట్టింది. శశికళ దాఖలు చేసిన నాలుగేళ్ల జైలు శిక్ష పునఃసమీక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో రూ.10 కోట్ల జరిమానా అంశంపై తెరపైకి వచ్చింది. 
 
నిజానికి బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. అలాగే శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా కూడా విధించింది. శిక్షను సుప్రీం కోర్టు కూడా ఖరారు చేసిన నేపథ్యంలో బెంగళూరు జైల్లో ఉన్న ముగ్గురు తక్షణం తలా రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంది. డబ్బు చెల్లించని పక్షంలో వారి ఆస్తులను అమ్మివేసి జరిమానాను జమ చేసుకుంటారు. లేదా శిక్షా కాలాన్ని పొడిగిస్తారు. ముందస్తు ప్రయత్నంగా శశికళ సహా ముగ్గురి ఆస్తులను జప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం