Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ నటికి చుక్కలు చూపించిన టెక్కీ.. స్నేహం-ప్రేమ- సహజీవనం.. చివరికి పెద్దలు వద్దన్నారని?

కన్నడ నటికి ఓ టెక్కీ ముఖం చాటేశాడు. కన్నడనటితో స్నేహం చేసి.. ఆమెను ప్రేమించి.. ఆపై సహజీవనం చేశాడు. తీరా పెళ్లి మాటెత్తే సరికి.. పెద్దలు అంగీకరించలేదని ముఖం చాటేశాడు. దీనిపై కన్నడనటి పోలీసులకు ఫిర్యాదు

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (13:10 IST)
కన్నడ నటికి ఓ టెక్కీ ముఖం చాటేశాడు. కన్నడనటితో స్నేహం చేసి.. ఆమెను ప్రేమించి.. ఆపై సహజీవనం చేశాడు. తీరా పెళ్లి మాటెత్తే సరికి.. పెద్దలు అంగీకరించలేదని ముఖం చాటేశాడు. దీనిపై కన్నడనటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కన్నడ నటి, ప్రాజెక్టు మేనేజర్ (టెక్కీ) ఉల్లాస్ పటేల్ గత రెండేళ్లుగా స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ చాలా చనువుగా ఉంటారని.. గతమూడు నెలల నుంచి సహజీవనం చేస్తున్నట్లు స్నేహితులు తెలిపారు. బెంగళూరు సదాశివనగర సమీపంలో కుటుంబ సభ్యులకు తెలీకుండా ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని సహజీవనం చేశారని సమాచారం.
 
జూన్ 3వ తేదీన తాను పనిపై మైసూరుకు వెళ్లానని, తిరిగి వచ్చి చూడగా ఉల్లాస్ పటేల్ మాయం అయ్యాడని, ఫోన్ చేస్తే మన పెళ్లికి మా పెద్దలు అంగీకరించడం లేదని.. మన పెళ్లి జరగదని చేతులెత్తేసినట్లు కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉల్లాస్ పటేల్‌తో పాటు ఆమె తల్లి తన మొబైల్‌కు ఫోన్ చేసి మర్యాదగా ఉండకపోతే నీ అంతు చూస్తాం అంటూ బెదిరింపులు వస్తున్నాయని.. దీంతో తన ప్రాణానికి హాని పొంచివుందని కన్నడనటి పోలీసులకు వెల్లడించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉల్లాస్ పటేల్‌పై ఐపీసీ 376, 417 సెక్షన్‌ల కింద అత్యాచారం, మోసం తదితర కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ కూడా మొదలు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments