Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌ అనంతర ప్రపంచంలో అత్యంత అవసరమైన నైపుణ్యంగా కమ్యూనికేషన్‌

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (17:14 IST)
అప్‌గ్రాడ్‌ నిర్వహించిన ఫ్రీ వీలింగ్‌ సంభాషణలో భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్‌ కోకా-కోలా బేవరేజస్‌ సీఈవో క్రిస్టీనా రుజిరో మాట్లాడుతూ కోవిడ్‌ అనంతర ప్రపంచంలో కమ్యూనికేషన్‌ అత్యంత కీలకమైన నైపుణ్యంగా మారిందని వెల్లడించారు. ‘జీవితాంతం అభ్యాసం’ అనే అంశంపై ఆమె సీరియల్‌ వ్యాపారవేత్త రోన్నీ స్ర్కూవాలా మరియు అప్‌గ్రాడ్‌ సీఈవో అర్జున్‌ మోహన్‌తో చర్చించారు.
 
‘‘నేను ప్రజలను ఎక్కువగా పంపే అతి పెద్ద తరగతి ఏదైనా ఉందంటే అది కమ్యూనికేషన్‌ తరగతికే. ఆఖరకు మా అభ్యాస మాసం సెప్టెంబర్‌లో కూడా మేము అభ్యాసాన్ని మరింత వేగవంతం చేశాం. నా వరకూ నేను కమ్యూనికేషన్‌పై ఓ తరగతి తీసుకున్నాను. కమ్యూనికేషన్‌ పరంగా మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ కమ్యూనికేషన్‌లో మనం చేసేందుకు ఇంకా ఎంతో ఉంటుంది.
 
కమ్యూనికేషన్‌ అంటే ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితం కాదు. అంతకు మించి చాలానే ఉంటుంది. మన ఆలోచనలు, భావనలను ఎంత స్పష్టంగా చెప్పగలుగుతున్నామన్నదే కమ్యూనికేషన్‌. ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని వెచ్చించి మనం ఎంత ప్రభావవంతంగా కమ్యూనికేట్‌ చేస్తున్నామనేది ఆలోచించాలి. కేవలం సమాచారం మాత్రమే మనం ఇచ్చుకుంటే సరిపోదు. చక్కటి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉంటే అవి ఖచ్చితంగా గేమ్‌ ఛేంజర్‌గా చాలామంది ప్రజలకు నిలుస్తాయి. అది ఉద్యోగాలు పొందడంలో మాత్రమే కాదు, ఇప్పటికే ఉద్యోగాలు పొంది ఉన్న వారికి కూడా  ఇది ఉపయుక్తంగా ఉంటుంది’’ అని క్రిస్టీనా అన్నారు.
 
తన సొంత అనుభవాల ద్వారా జీవితాంతం నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను వెల్లడించారు. దాదాపు 55 దేశాలలో నివశించడంతో పాటుగా ఎంతోమందితో కలిసి పనిచేయడం మరియు విభిన్నమైన వ్యక్తులను కలువడం వల్ల తాను నిరంతరం నేర్చుకునేందుకు, తద్వారా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడిందన్నారు. అభ్యాసాన్ని ఓ  కార్యక్రమంలా మలచవద్దని వెబినార్‌లో పాల్గొన్న అభ్యర్థులను కోరిన ఆమె, అభ్యాసమనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. 
 
కోర్సులు, వెబినార్లు, కరిక్యులమ్స్‌, సహచరుల నుంచి ఇన్‌పుట్స్‌ కోరడం, నిష్ణాతుల నుంచి అభ్యసించడం, నైపుణ్యాలను ఉద్యోగ విధులలో ఉపయోగించడం వంటివి తమను తాము మెరుగు పరుచుకునేందుకు అత్యంత విలువైన ఉపకరణములుగా తోడ్పతాయి. విభిన్న అంశాలపై తరగతులను తీసుకోవడం ఒక్కటే సరిపోదు’’ అని స్పష్టం చేశారు.
 
సామాన్యులు లేదా నిపుణులకు మాత్రమే ప్రపంచం చెంది ఉంటుందా అనే అంశమై క్రిస్టీనా మాట్లాడుతూ జిజ్ఞాసవంతులు మరియు విభిన్న అంశాలను అంతే వైవిధ్యంగా చూసే వ్యక్తులు నేటి ప్రపంచంలో తమ దైన మార్కును ఏర్పరుచుకోగలడంలో సహాయపడగలరన్నారు.
 
జవాబుదారీ భాగస్వామ్య నేపథ్యం గురించి కూడా క్రిస్టీనా మాట్లాడారు. దీనిలో ఒకరు తమ జీవితంలో, ప్రొఫెషనల్‌ లేదా వ్యక్తిగతంగా ఎన్నుకుంటారు. వీరు జీవితంలోని ప్రతి దశలోనూ మార్గనిర్దేశనం చేయడంతో పాటుగా నిజాయితీగా సంభాషించడానికి లేదా ప్రతి దశలోనూ ఇన్‌పుట్స్‌ను అందించడంలోనూ సహాయపడగలరు. ‘‘మీకు ఎవరైతే తోడ్పడగలరనుకుంటున్నారో వారిని ఎంచుకోండి, టేబుల్‌ వద్ద ఉన్న వారెవరైనా కావొచ్చు, మీ జీవితంలో ఉన్న వారు అయినా కావొచ్చు, స్థిరంగా మంచి విషయాలను మీకు తెలిపే వారెవరైనా సరే ఎన్నుకోండి’’ అని ఆమె సలహా ఇచ్చారు.
 
ఈ వెబినార్‌ సెషన్‌లో దాదాపు 1000 మందికి పైగా పాల్గొన్నారు మరియు వేలాది మంది పలుడిజిటల్‌ ఛానెల్స్‌ ద్వారా ఈ సంభాషణను వీక్షించారు. దాదాపు 60 నిమిషాల పాటు జరిగిన ఈ సదస్సులో క్రిస్టీనా, హెచ్‌సీసీబీ తమ పురాతన మూల సిద్ధాంతాలకు ఏ విధంగా కట్టుబడినదీ వివరించారు.
 
తమ ఉత్పత్తులు ఇప్పటికీ ఏ విధంగా బెంచ్‌మార్క్‌గా నిలుస్తున్నదీ వెల్లడించడంతో పాటుగా అన్ని లింగాల ఉద్యోగులకూ సమాన అవకాశాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభావవంతమైన కమ్యూనికేషన్‌పై చేయాల్సిన, చేయకూడని అంశాలను గురించి సహా ఎన్నో ప్రశ్నలకు రోన్నీ మరియు క్రిస్టీనాలు సమాధానాలిచ్చారు. అదే రీతిలో ఒకరి అంతర్గత ఉత్సాహాన్ని ఫలవంతంగా మార్చడం మరియు వారిని అత్యుత్తమ నాయకులుగా నడిపించడం గురించి కూడా మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments