Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ పాఠశాల ఓవరాక్షన్: తల్లిదండ్రుల్ని కలిశాడని బాలుడిని కొట్టిచంపేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (18:33 IST)
ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలు పిల్లల్ని మంచిదారిన నడిపించేందుకు ఎంతగా ఉపయోగపడుతాయో ఏమో కానీ.. ఆ నిబంధనల కారణంగా ఓ పిల్లాడిని పొట్టన పెట్టుకున్న ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్‌లోని డాక్ బంగ్లా సమీపంలోని ఆల్ ఇస్లామియా మిషన్ పాఠశాలలో షమీమ్ మాలిక్ (12) అనే బాలుడు సోమవారం సాయంత్రం పాఠశాల బయట తల్లిదండ్రులను కలిశాడు.
 
అంతే అనుమతి లేకుండా.. తల్లిదండ్రుల్ని కలిశాడనే కారణంతో స్కూల్ హెడ్ మాస్టర్ హలీఫ్ షేక్, వార్డెన్ లీటన్ షేక్ ఒకరి తరువాత ఒకరు బాలుడిని తీవ్రంగా కొట్టారు. బాలుడనే దయ, కనికరం లేకుండా విచక్షణారహితంగా చితక్కొట్టడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. దీంతో కొట్టడం మానేసిన ఈ టీచర్లు బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో షమీమ్ ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిద్దరినీ అరెస్ట్ చేశారు. తమను కలిశాడన్న కారణంగా తమ కుమారుడ్ని వారిద్దరూ హత్య చేశారని షమీమ్ తల్లి షమీనా బీబీ కన్నీరుమున్నీరయ్యారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments