Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలు చేసిన పనికి సారీ చెపుతున్నా : అశోకగజపతిరాజు

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (11:55 IST)
ఎయిరిండియా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పించేలా బీజేపీ నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన పనులకు తాను క్షమాపణలు చెపుతున్నట్టు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖామంత్రి పూసపాటి అశోకగజపతిరాజు తెలిపారు. 
 
గురువారం విదేశీ పర్యటనకు వెళ్లిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాశ్మీర్ వెళ్లిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిర్వాకం కారణంగా ఎయిరిండియా విమానాలు సుమారు గంటసేపు ఆలస్యంగా నడిచాయి. ఈ కారణంగా ఈ విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యానికి గురికాగా, పెను చర్చనీయాంశమైంది. 
 
ఈ విషయం తెలుసుకున్న మంత్రి అశోకగజపతిరాజు స్పందించారు. ప్రజల్లోకి వెళ్లిన సమాచారం ప్రకారం చూస్తే, ఈ అంశం ప్రతివాదనకు తావులేనిదన్నారు. మంత్రుల నిర్వాకం వల్ల ఎవరెవరికి ఇబ్బంది కలిగిందో వారందరికీ సంబంధిత శాఖామంత్రిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అసలు జరిగిందేమిటో తెలుసుకుంటామని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments