Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్ని-V టెస్ట్.. చైనా వణుకు.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (21:36 IST)
అగ్ని-V టెస్ట్ నిర్వహించడం భారత్​కు ఇది తొలిసారి కాకపోయినా.. డ్రాగన్ దేశం చైనా ఈసారి మరింత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ టెస్టుల తర్వాత భారత రక్షణ దళం అమ్ములపొదిలోకి ఈ ఖండాంతర అగ్ని క్షిపణి చేరనుంది. దీంతో భారత సాయుధ దళానికి మరింత బలం చేకూరినట్టవుతుంది. అసలు అగ్ని- V విషయంలో చైనా ఎందుకు ఆందోళన చెందుతోంది. 
 
అగ్ని- V.. భారత తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం). 5000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు. దశాబ్దకాలం పాటు దీని తయారీ ప్రక్రియ జరిగింది. అనుకున్న సుదూర లక్ష్యాన్ని అగ్ని- V విజయవంతంగా ఛేదించిందని 2018 జనవరిలో నిర్వహించిన ఐదో పరీక్ష తర్వాత భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
 
అయితే, ఒకే ఏడాది రెండుసార్లు టెస్ట్ చేశాక సాయుధ దళాలకు అగ్ని- Vను అప్పగించాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది జూన్​, డిసెంబర్​లో క్షిపణి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇది ఆలస్యమైంది. అయితే తదుపరి టెస్టు సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. అయితే మిసైల్​కు ఇదే తొలి యూజర్ ట్రైల్స్ అని సమాచారం. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments