Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా-పాకిస్థాన్ ఒకటైనాయి.. యుద్ధం వస్తే దాడి ఖాయం.. రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (14:58 IST)
అరుణాచల్ ప్రదేశ్‌లోని దవాంగ్ సెక్టార్‌లో ఇటీవల ఆక్రమణలకు పాల్పడిన చైనా సైనికులను భారత సైనికులు తరిమికొట్టారు. ఈ వివాదం కారణంగా ఇరుదేశాల సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజింగ్‌లో జరిగిన ఒక సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో సుస్థిరతను నిర్ధారించడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి భారత్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. 
 
ఈ సందర్భంలో, ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారతదేశానికి వ్యతిరేకంగా చైనా-పాకిస్తాన్‌లు ఒక్కటయ్యాయని మండిపడ్డారు. యుద్ధం వస్తే కలిసి భారత్‌పై దాడి చేయవచ్చునని కూడా తెలిపారు. సరిహద్దులో ఏం జరిగిందో కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పాలని, మనం ఏ చర్య తీసుకున్నా ఇప్పుడే ప్రారంభించాలని, నిజానికి ఐదేళ్ల క్రితమే చర్యలు తీసుకోవాల్సి ఉందని రాహుల్ అన్నారు. త్వరగా చర్యలు తీసుకోకుంటే దేశానికి ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments