Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ పీకలదాకా మద్యం సేవించి రావడం... కన్నబిడ్డపై అత్యాచారం చేయడం... ఎక్కడ?

12 యేళ్ల కుమార్తెను బెదిరించి లొంగదీసుకుని గత ఆర్నెల్లుగా కామవాంఛ తీర్చుకుంటూ వచ్చిన భర్తను కట్టుకున్న భార్య పోలీసులకు పట్టించింది. ఈ దారుణం చెన్నై నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అత్యాచార

Webdunia
బుధవారం, 24 మే 2017 (14:25 IST)
12 యేళ్ల కుమార్తెను బెదిరించి లొంగదీసుకుని గత ఆర్నెల్లుగా కామవాంఛ తీర్చుకుంటూ వచ్చిన భర్తను కట్టుకున్న భార్య పోలీసులకు పట్టించింది. ఈ దారుణం చెన్నై నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అత్యాచార వివరాలను పరిశీలిస్తే... బీహార్‌కు చెందిన 44 యేళ్ల వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి చెన్నై నగరానికి కొన్నేళ్ల క్రితం వలస వచ్చారు. స్థానిక వళ్ళూవర్‌కోట్టం వద్ద వారంతా నివశిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో సెక్యూరిటీ ఉద్యోగానికి వెళుతూ రాత్రిపూట ఇంటికి వచ్చే ఆ కసాయి తండ్రి.. ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికొచ్చి 12 యేళ్ళ కుమార్తెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ తంతు గత ఆర్నెల్లుగా సాగుతూ వచ్చింది. ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానని కుమార్తెను బెదిరించాడు. దీంతో ఆ యువతి భయపడి తనపై జరుగుతున్న అత్యాచారాన్ని బయటకు చెప్పలేదు. 
 
అయితే, రోజురోజుకూ తండ్రి అరాచకం హద్దులుదాటిపోవడంతో ఆ బాలిక తన సోదరుడి వద్ద బాధను వెళ్లగక్కింది. ఆ తర్వాత తల్లికి చేరడంతో వారంతా వెళ్లి స్థానిక తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. కామాంధ తండ్రిని అరెస్టు చేసి సైదాపేట మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరగా, జ్యూడీషియల్ కస్టడీకి తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments