Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై టెక్కీ స్వాతి దారుణ హత్య... వారం క్రితం కూడా వాదన పెట్టుకున్నాడు...

వాడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. ఆమె అతడి వార్నింగులను లైట్ గా తీసుకోవడం వల్ల ప్రాణాలను కబళించాడు ఆ దుండగుడు. చెన్నై నుంగబాక్కం రైల్వే స్టేషనులో పట్టపగలు అందరూ చూస్తుండగా నల్ల ప్యాంటు ధ

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (16:20 IST)
వాడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. ఆమె అతడి వార్నింగులను లైట్ గా తీసుకోవడం వల్ల ప్రాణాలను కబళించాడు ఆ దుండగుడు. చెన్నై నుంగబాక్కం రైల్వే స్టేషనులో పట్టపగలు అందరూ చూస్తుండగా నల్ల ప్యాంటు ధరించిన ఓ దుండగుడు చెన్నై ఇన్పోసిస్ లో పనిచేస్తున్న స్వాతి అనే 24 ఏళ్ల యువతిని పీక కోసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. 
 
క్రిక్కిరిసిన రైల్వే స్టేషనులో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేస్తున్నా అంతా అలా చూస్తూ ఉండిపోయారు. తేరుకునేసరికి దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా ఇదే వ్యక్తి స్వాతితో గత వారం తీవ్రంగా వాదనకు దిగడాన్ని తను చూసినట్లు ఓ క్యాబ్ డ్రైవర్ వెల్లడించాడు. అతడు చెప్పినదాన్ని బట్టి అతడు స్వాతికి తెలిసినవాడై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాతి బంధువులను, ఇతర స్నేహితులను విచారిస్తున్నారు.
 
కాగా తమ ఉద్యోగి దారుణ హత్యపై ఇన్ఫోసిస్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామనీ, దుండగుడిని కఠినంగా శిక్షించాలని తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments