Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క వైద్యుడు... 7 గంటలు - 101 కు.ని ఆపరేషన్లు.. హౌ?

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (09:55 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ వైద్యుడు సరికొత్త రికార్డును నెలకొల్పారు. కేవలం ఏడు గంటల్లో 101 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి దేశంలోనే కాదు ప్రపంచంలోనే చరిత్ర సృష్టించాడు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఆపరేషన్లు జరిగాయి. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని సర్గూజ జిల్లా నర్మదాపుర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత నెల 27న ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో ఒక వైద్యుడు కేవలం ఏడు గంటల వ్యవధిలో ఏకంగా 101 మంది మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేశారు. 
 
మార్గదర్శకాల ప్రకారం ఒక వైద్యుడు రోజులో గరిష్టంగా 30 ఆపరేషన్లు మాత్రమే చేయాల్సి ఉంది. చికిత్సలు చేయించుకున్న మహిళల ఆరోగ్యం బాగున్నప్పటికీ, నిబంధనలు అతిక్రమించినందున సమాధానం ఇవ్వాలని ఆపరేషన్లు చేసిన వైద్యుడు డాక్టర్‌ జిబ్నస్‌ ఎక్కాతో పాటు పర్యవేక్షించిన సమితి వైద్యాధికారి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.సింగ్‌లకు నోటీసులు ఇచ్చింది. 
 
శిబిరానికి చాలా మంది మారుమూల గ్రామాల మహిళలు వచ్చారని, మరోసారి రావడం కష్టమవుతుందని చెప్పి అదే రోజున ఆపరేషన్లు చేయాలని కోరారని వైద్యులు వివరణ ఇచ్చారు. దాంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆపరేషన్లు చేసినట్టు తెలిపారు. అయినా సంతృప్తి చెందని ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేసింది. 
 
2014లో బిలాస్‌పుర్‌ జిల్లాలో ఇదే తరహాలో ఆపరేషన్లు చేయగా 83 మంది మహిళల్లో తదనంతర సమస్యలు వచ్చాయి. అందులో 13 మంది మరణించారు. అప్పటి నుంచి రోజువారీ ఆపరేషన్లపై పరిమితి విధించింది. దాన్ని ఉల్లంఘించడాన్ని ప్రభుత్వం తప్పుపడుతూ విచారణకు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments