Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగి నామం జపించండి.. లేదా యూపీని వదిలి వెళ్లిపోండి.. హోర్డింగ్ కలకలం

యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలతో జెట్ వేగంతో దూసుకెళ్తున్నారు. అయితే మీరట్ ప్రాంతంలో హోర్డింగ్‌లు వివాదానికి దారితీశాయి. ఈ హోర్డింగ్‌లను హిందూ యువ వాహిని ఏర్పాటు చేసింది. హోర్డింగ్‌లపై ప్ర

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (15:37 IST)
యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలతో జెట్ వేగంతో దూసుకెళ్తున్నారు. అయితే మీరట్ ప్రాంతంలో హోర్డింగ్‌లు వివాదానికి దారితీశాయి. ఈ హోర్డింగ్‌లను హిందూ యువ వాహిని ఏర్పాటు చేసింది. హోర్డింగ్‌లపై ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఫొటోలతో పాటు 'యోగి నామం జపించండి. లేదా ఉత్తర్‌ప్రదేశ్‌ వదిలి వెళ్లిపోండి' అని రాసి ఉంది.
 
ఈ హోర్డింగ్‌పై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ జే రవీంద్ర గౌర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ల నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని రవీంద్ర గౌర్ వెల్లడించారు. 
 
ఇప్పటికే ఈ హోర్డింగ్‌పై యువవాహిని రాష్ట్ర సభ్యుడు నాగేంద్ర ప్రతాప్ సింగ్‌ను పోలీసులు సంప్రదించారు. ఈ హోర్డింగ్‌లను గతంలో యువవాహిని సభ్యుడిగా ఉన్న నీరజ్ శర్మ పంచాలీ వేయించి ఉంటాడని తెలుస్తోంది. అతడిని బృందం నుంచి తొలగించడంతో సంస్థకు చెడుపేరు తెచ్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments