Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 12 నుంచి చంద్రయాన్-3

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (14:12 IST)
అన్నీ అనుకున్నట్టుగా సాగితే వచ్చే నెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపడుతామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. ఆ తర్వాత కూడా ప్రయోగాన్ని చేపట్టవచ్చని, అయితే ఇందుకు ఇంధనాన్ని ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. 
 
ఇప్పటికే చంద్రయాన్‌-3 వ్యోమనౌక శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రానికి చేరుకుందని వివరించారు. తుది ఏర్పాట్లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. చంద్రయాన్‌-3 ప్రయోగానికి ఎల్‌వీఎం-3ని ఉపయోగిస్తాం. దాని కూర్పు పని సాగుతోంది. దానికి సంబంధించిన భాగాలన్నీ శ్రీహరికోట చేరుకున్నాయి అని సోమనాథ్‌ తెలిపారు. 
 
రాకెట్‌ కూర్పు ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత చంద్రయాన్‌-3ని రాకెట్‌తో అనుసంధానిస్తామని తెలిపారు. దీని ప్రయోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వ్యోమనౌకలో అనేక మార్పులు చేపట్టామన్నారు. అందులో అధిక ఇంధనాన్ని జోడించామని, దాని కాళ్లను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఎక్కువ సౌరశక్తిని ఒడిసిపెట్టేలా పెద్ద సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో డ్రింకర్ సాయి అప్రిషియేషన్ : నిర్మాత బసవరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments