Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు మద్దతు తెలిపినందుకు కేంద్రం శిక్షిస్తోంది : సీఎం కేజ్రీవాల్

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (17:50 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపినందుకు కేంద్రం తమను శిక్షిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తంచేశారు. 
 
ఆదివారం హర్యానా రాష్ట్రంలోని జింద్‌లో కిసాన్ మహాపంచాయతీని ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. అంతకుముందు రైతుల నిరసన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులు అర్పించారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నందునే వారికి మద్దతుగా నిలిచామని కేజ్రీవాల్ చెప్పారు. 
 
‘కేజ్రీవాల్‌ను శిక్షించాలన్న ఏకైక లక్ష్యంతో వారు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. రైతుల నిరసనకు మద్దతు ఇచ్చినందుకు మేం ప్రతిఫలాలను ఎదుర్కొన్నాం. వారు బిల్లును ఆమోదించడం ద్వారా, ఎన్నికైన ప్రభుత్వానికి బదులుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతుల్లోకి అధికారాన్ని అప్పగించడం ద్వారా వారు మాకు శిక్ష వేస్తున్నారు. దీని కోసం స్వాతంత్ర్య పోరాటం చేయాలా?’ అని ఆయన ప్రశ్నించారు. 
 
ఆందోళన సమయంలో మరణించిన 300 మంది త్యాగాలకు వందనం చేస్తున్నామని, వారి త్యాగం వృధాకాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉన్నదని కేజ్రీవాల్‌ చెప్పారు. కాగా, కేంద్రం తీసుకొచ్చి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వేదికగా రైతులు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments