Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం : 11కు పెరిగిన మృతులు - బిపిన్ రావత్‌ ఏమయ్యారు?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (15:35 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో భారత ఆర్మీకి చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. మరో ముగ్గురి పరిస్థి తెలియాల్సివుంది. అయితే, ఈ హెలికాప్టరులో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తన కుటుంబ సభ్యులతో ప్రయాణించారు. వీరిలో బిపిన రావత్ భార్య మధులిక రావత్ చనిపోయారు. కానీ బిపిన్ రావత్ పరిస్థితి ఏంటో తెలియలేదు. 
 
కాగా, తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరుకు సమీపంలోని కాట్టేరి అనే అటవీ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన మిలిటరీ ట్రాన్స్‌పోర్టు హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది వరకు ప్రయాణించారు. వీరిలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. అయితే, బిపిన్ రావత్ పరిస్థితి మాత్రం తెలియడం లేదు. 
 
బుధవారం ఈ హెలికాఫ్టర్ కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌కు బయలుదేరిన తర్వాత 12.40 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అయితే, ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కాట్టేరి అనే ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ కాలిబూడిదైంది. గత కొన్ని రోజులుగా ఈ జిల్లాలో దట్టమైన పొగమంచు అలుముకునివుంది. దీనికితోడు హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు సమాచారం. ఈ కారణంగానే హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments