Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదనీ రోమియో ఏం చేస్తున్నాడో చూడండి (Video)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. యువతి ప్రేమించలేదన్న కోపంతో ఓ రోమియో ఓ యువతిపై చేయి చేసుకున్నాడు. సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దాడి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలోని ఫిలిబిత్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలను పర

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (13:17 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. యువతి ప్రేమించలేదన్న కోపంతో ఓ రోమియో ఓ యువతిపై చేయి చేసుకున్నాడు. సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దాడి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలోని ఫిలిబిత్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
ఓ శాడిస్ట్ తనను ప్రేమించాలంటూ ఓ అమ్మాయిని బలవంత పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆ శాడిస్ట్, యువతి చెంపపై చేత్తో వరుసగా ఐదు సార్లు బలంగా కొట్టాడు. అక్కడే ఉన్న మరో యువతి వద్దంటూ వారిస్తున్నా... పట్టించుకోలేదు. ఇంతలో అక్కడకు మరో మహిళ స్కూటర్‌పై రావడంతో అతడు తన దాడిని ఆపేశాడు. ఆ తర్వాత కొట్టినందుకు క్షమించాలంటూ ప్రాధేయపడ్డాడు. కాళ్లు పట్టుకోబోయాడు. 
 
కానీ, అతడి క్రూరత్వాన్ని కళ్లారా చూసిన ఆ యువతి మళ్లీ నిరాకరించింది. స్కూటర్‌పై అక్కడకు వచ్చిన మహిళ ఇదంతా గమనించి దాడికి గురైన బాధితురాలి చేయి పట్టుకుని తన వెంట‌ లోపలికి తీసుకెళ్లింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డుకావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments