Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు బస్సు అనుకుని.. తెలంగాణ బస్సుకు నిప్పు ... ఆంధ్రా వ్యక్తి సజీవదహనం

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. షిర్డీ - హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే బస్సుకు కొందరు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సజీవ దహనమ

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (09:29 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. షిర్డీ - హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే బస్సుకు కొందరు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అలాగే ఆ బస్సులో మరికొంతమంది మృతులున్నట్లు సమాచారం. 
 
కావేరీ నదీ జలాల విషయంపై కర్ణాటక రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఆందోళనలు విధ్వంసాలకు దారితీయగా... శుక్రవారం షిర్డీ- హైదరాబాద్‌ బస్సుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సు టీఎస్ రిజిస్ట్రేషన్‌తో ఉండగా తమిళనాడు(టీఎన్) రాష్ట్రానికి చెందిన బస్సు అనుకుని ఆందోళనకారులు నిప్పుపెట్టారు. 
 
దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన విహాన్ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరికొంత మంది కూడా సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. కాగా... ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా తెలుగు వారే ఉన్నట్లు సమాచారం.
 
మరోవైపు.. కర్నాటక వ్యాప్తంగా భారీ సంఖ్యలో బలగాలను మొహరించివున్న విషయం తెల్సిందే. పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బచ్చన్ కోసం మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

సుమ‌న్‌తేజ్, హెబ్బాప‌టేల్ న‌టించిన సందేహం మూవీ రివ్యూ

భారతీయ చిత్రపరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments