Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవుల చెవులకు డిజిటల్ చిప్... ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (12:14 IST)
గోవుల అక్రమ రవాణా, గోవధ నియంత్రణకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులోభాగంగా గోవులు ఎక్కడున్నా వాటిని సులభంగా గుర్తించేందుకు వీలుగా డిజిటల్ చిప్స్‌ను ఆవుల చెవుల్లో అమర్చనున్నారు. 
 
ఈ డిజిటల్ చిప్‌ల విధానంలో భాగంగా, చెవుల్లో ఐడీ నంబరుతో కూడిన జీపీఎస్ ఆధారిత డిజిటల్ చిప్‌లను అమర్చుతారు. ఈ డిజిటల్ చిప్ ధర ఒక్కొక్కటి ఆరు రూపాయలు. గోవుల అక్రమ రవాణాకు ఈ డిజిటల్ చిప్స్ ఎంతగానో ఉపయోగపడుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం బలంగా చెబుతోంది. ముఖ్యంగా, ఈ చిప్ ఆధారంగా ఆవులు ఎక్కడున్నా సులభంగా కనిపెట్టవచ్చని, అందువల్ల రైతులు ఇక నిశ్చింతగా ఉండొచ్చని చెప్పింది. 
 
ఈ చిప్‌లలో ఆవులకు కేటాయించిన నంబరు, వాటి చిరునామా, రంగు, ఆరోగ్య పరిస్థితులతో కూడిన వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 71 లక్షల పాలిచ్చే ఆవులు ఉండగా, 1.30 లక్షల పశువులు ఉన్నాయని ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments