Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం పళనిస్వామికి పదవీగండం? ఓటర్లకు డబ్బు పంపిణీ టార్గెట్‌లో అడ్డంగా బుక్కయినట్లే!

తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రభుత్వం కూలిపోనుందా.. ఎన్నికల సంఘం సేకరించిన సమాచారం రుజువులు నిజమే అయితే రాజ్యాంగబద్ద పాలన చేస్తానన్న ప్రమాణాన్ని ధిక్కరించినందుకు గాను సీఎం పళనిస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటూ రాజకీయ పరిశీకులు

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (01:19 IST)
తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రభుత్వం కూలిపోనుందా.. ఎన్నికల సంఘం సేకరించిన సమాచారం రుజువులు నిజమే అయితే రాజ్యాంగబద్ద పాలన చేస్తానన్న ప్రమాణాన్ని ధిక్కరించినందుకు గాను సీఎం పళనిస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటూ రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు. స్వయంగా ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రంలోని ఒక ఉప ఎన్నికలో తలదూర్చి ఓటర్లకు డబ్బు పంచే లక్ష్యాన్ని తనపై పెట్టుకున్నట్లు సాక్ష్యాధారాలు బయటపడటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఫలితంగా తొలిమెట్టుగా ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేసిన ఈసీ తదుపరి దిశగా తమిళనాడు సీఎంపై చర్య తీసుకునేదిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
 
 
మంత్రి విజయ భాస్కర్ వద్ద దొరికిన ఒక కీలక డాక్యుమెంట్‌ను ఆర్కే నగర్ నియోజక వర్గంలోని 85 శాతం ఓటర్లను కొనుగోలు చేసే వ్యూహానికి సంబంధించిన నమూనా పత్రంగా ఈసీ గుర్తించింది. ఆర్కే నియోజక వర్గాన్ని 256 విభాగాలుగా విభజించి మొత్తం 2.6 లక్షల మంది ఓటర్లలో 85 శాతమంది ఓటర్లకు ఒక్కొక్కరికి రూ. 4 వేలచొప్పున పంచాలని రాసుకున్న ఆ నమూనా పత్రం ఈసీకి సరైన సాక్ష్యంలా దొరికింది. నియోజకవర్గంలోని 85 శాతం మంది ఓటర్లలో ఒక్కొక్కరికి 4 వేల చొప్పున పంచితే మొత్తం రూ. 89 కోట్లు అవుతుందని అంచనా. 
 
పైగా ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి, అటవీ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్, ఆర్థిక మంత్రి జయకుమార్తో పాటు ఏడుగురు అధికార పార్టీకి చెందిన నేతలు ఉపఎన్నిక గెలుపుకు సంబంధించిన లక్ష్యాన్ని రూపొందించుకున్నట్లు మంత్రి విజయభాస్కర్ వద్ద ఈసీ చేజిక్కించుకున్న ఫత్రం తెలిపింది. ముఖ్యమంత్రే స్వయంగా 33 వేలమంది ఓటర్లకు 13. 27 కోట్ల రూపాయలను పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని తనపై విధించుకున్నారు.
 
తీవ్ర అనారోగ్యంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనూహ్యం మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌ స్థానానికి ఏప్రిల్‌ 12న ఉప ఎన్నిక జరగాల్సిఉంది. అయితే అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్లు బట్టబయలైంది. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments