Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవించాల‌నే కోరిక చచ్చిపోయింది... జిల్లా కలెక్టర్ సూసైడ్

ఓ దారుణం జరిగింది. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా కలెక్టర్ (మేజిస్ట్రేట్) ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారి పేరు ముఖేష్ పాండే. ఆయన మృతదేహాన్ని ఘజియాబాద్‌లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద ఛిద్రమైన స్థితిలో ప

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (14:10 IST)
ఓ దారుణం జరిగింది. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా కలెక్టర్ (మేజిస్ట్రేట్) ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారి పేరు ముఖేష్ పాండే. ఆయన మృతదేహాన్ని ఘజియాబాద్‌లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద ఛిద్రమైన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. అయితే, తన ఆత్మహత్యకు ఏ ఒక్కరూ కారణం కాదనీ, తన సొంత నిర్ణయంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నానని పాండే తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. 
 
"మనిషి అనేవాడికి ఈ భూమిపై మనుగడ లేదని త‌న‌కు జీవించాల‌నే కోరిక చచ్చిపోయిందని, త‌న మ‌ర‌ణం గురించి త‌న‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయండని" అని సూసైడ్ నోట్‌లో రాశాడు. 
 
అంతకుముందు ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడ ఉన్న లీలా ప్యాలెస్ హోటల్‌లోని 742 గదిలో బస చేశారు. ఈ గదిలో సూసైడ్ నోట్ కూడా రాసి ఉంచార‌ని పోలీసులు తెలిపారు. అలాగే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డేముందు స‌ద‌రు క‌లెక్ట‌ర్ త‌న స్నేహితుల‌కు ఫోన్ చేసి, ఢిల్లీలోని జానకీపురిలోని ఓ షాపింగ్ మాల్ పైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని చెప్పాడ‌ని అన్నారు. 
 
అయితే, ముఖేష్ పాండే రైల్వే స్టేషన్ వైపు వెళ్లి అక్క‌డ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. 2012 బ్యాచ్‌కు చెందిన ముకేష్ పాండేకు సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందడమేకాకుండా మంచి పేరు కూడా ఉంది. క‌లెక్ట‌ర్‌ మృతి పట్ల బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్ సంతాపం తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments