ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అగౌరవపరిచారని ఓ బీఎస్ఎఫ్ జవాను వేతనంలో కోత విధించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మహత్‌పూర్ 15 బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అగౌరవపరిచారని ఓ బీఎస్ఎఫ్ జవాను వేతనంలో కోత విధించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మహత్‌పూర్ 15 బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎఫ్ జవాన్ సంజీవకుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన పరేడ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీని గౌరవనీయులైన లేదా శ్రీ అని సంభోదించలేదు.
అంతే బీఎస్ఎఫ్ చట్టం 40 కింద ప్రధానిని అగౌరపర్చాడని జవాన్ సంజీవ కుమార్‍పై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని బెటాలియన్ కమాండెంట్ అనూప్‍లాల్ భగత్ నిర్ణయించారు. బీఎస్ఎఫ్ జవాన్ సంజీవ కుమార్‍కు ఏడురోజుల జీతాన్ని కోత విధిస్తూ బెటాలియన్ కమాండెంట్ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త ఇపుడు వైరల్‌గా మారింది.