Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌కు 1001 రాఖీలు.. మోడీకి 501 రాఖీలు.. ఎవరు పంపారు?

భారతీయులకు చెందిన ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెక్ పెట్టినా.. భారతీయులు మాత్రం ఆయన పట్ల గౌరవప్రదంగా నడుచుకుంటున్నారు. ఇందులో భాగంగా రాఖీ పండుగను పురస్కరించుకుని ట్రంప్‌కు 1001 రాఖ

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (17:54 IST)
భారతీయులకు చెందిన ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెక్ పెట్టినా.. భారతీయులు మాత్రం ఆయన పట్ల గౌరవప్రదంగా నడుచుకుంటున్నారు. ఇందులో భాగంగా రాఖీ పండుగను పురస్కరించుకుని ట్రంప్‌కు 1001 రాఖీలు పంపారు.. ట్రంప్ గ్రామం సోదరీమణులు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని మేవార్ ప్రాంతం, మారోరా గ్రామానికి ''ట్రంప్ గ్రామం'' అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. 
 
ఈ గ్రామానికి ట్రంప్ విలేజ్ అంటూ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ అనధికారిక నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 7) రాఖీ పౌర్ణిమను పురస్కరించుకుని ఆ గ్రామానికి చెందిన యువతులు డొనాల్డ్ ట్రంప్‌ను తమ అగ్రజునిగా, పెద్ద సోదరునిగా భావిస్తూ..1001 రాఖీలు త‌యారు చేసి అమెరికాకు పంపారు. 
 
డొనాల్డ్ ట్రంప్‌తో ఆగిపోకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా 501 రాఖీలు పంపారు. వీరిద్దరూ ఏకంగా తమ గ్రామాన్ని సందర్శించాలంటూ పిలుపునిచ్చారు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ సూచన మేరకు సులభ్ విభాగం ఈ గ్రామంలో 95 టాయిలెట్లను నిర్మించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments