Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతూ తిరిగిరాని లోకాలకు పెళ్ళికొడుకు

కర్నాటక రాష్ట్రంలోని హోసూరులో ఓ విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. మరో నాలుగు రోజుల్లో జరగాల్సిన పెళ్లికి.. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు దుర్మరణ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (12:41 IST)
కర్నాటక రాష్ట్రంలోని హోసూరులో ఓ విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. మరో నాలుగు రోజుల్లో జరగాల్సిన పెళ్లికి.. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు దుర్మరణం పాలయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హోసూరుకు సమీపంలోని కుంబళం గ్రామానికి చెందిన రైతు మంజు (25) అనే యువకుడికి ఆంధ్రప్రదేశ్‌‌లోని మంచునాయకనపల్లి గ్రామానికి చెందిన సుధ(19)తో వివాహం నిశ్చయమైంది. మంజు ఆదివారం ఉదయం పెళ్ళిపత్రికలను తన స్నేహితులకు, బంధువులకు అందజేసేందుకు తమ ఊరినుంచి శూలగిరివైపు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. 
 
ఆ సమయంలో ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఇతని వాహనాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన మంజు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇతన్ని ఢీకొన్న కారు ఆగకుండా వెళ్ళిపోయింది. సమాచారం తెలిసిన శూలగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని స్వాదీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పరారైన కారు డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments