Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కోసం వెళ్తున్నా కరోనా వదల్లేదు.. డ్రైవర్‌కు, పెళ్లికొడుకుకు పాజిటివ్

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (21:47 IST)
పెళ్లి కోసం కారులో వెళ్తున్న వరుడు, డ్రైవర్‌కు కోవిడ్ వైరస్ సోకిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో ఆ జిల్లాలో వివాహ కార్యక్రమాలను నిషేధించారు. మరోవైపు వివాహం కోసం రెండు వాహనాల్లో ఊరేగింపుగా వెళ్తున్నపెండ్లి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 
 
వైద్య సిబ్బందితో వారికి రాపిడ్ యాంటిజెన్ పరీక్ష జరిపించారు. వరుడితోపాటు కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన పెండ్లి బృందంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మహారాష్ట్రలో కరోనా మరణాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం 800కుపైగా కరోనాతో మరణిస్తున్నారు. 
 
గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 54,022 కరోనా కేసులు, 898 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,96,758కు, మొత్తం మరణాల సంఖ్య 74,413కు పెరిగింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments