Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు రాజీనామా చేయవా? ఐతే నేనే చేస్తా... బీహార్ సీఎం రాజీనామా

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాలూ కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తను చెప్పినట్లు అవినీతి కేసుల నుంచి క్లీన్ ఇమేజితో వచ్చేందుకు ససేమిరా అనడంతో తనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఇంచార్జి గవ

Webdunia
బుధవారం, 26 జులై 2017 (18:56 IST)
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాలూ కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తను చెప్పినట్లు అవినీతి కేసుల నుంచి క్లీన్ ఇమేజితో వచ్చేందుకు ససేమిరా అనడంతో తనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఇంచార్జి గవర్నరుకు అందజేశారు. దీనితో ఆర్జేడీ-జేడీ మధ్య వివాదం మరింది ముదిరిపోయినట్లు అర్థమవుతుంది. 
 
ఇంతకీ నితీష్ రాజీనామాకు కారణం ఏంటయా అంటే... అక్రమాస్తులు, అవినీతి కేసులను లాలూ ప్రసాద్‌తో సహా ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం అయిన తేజస్వి యాదవ్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో కేసులన్నీ ఎదుర్కొని, విచారణ పూర్తయ్యాక క్లీన్ ఇమేజితో రావాలనీ, అప్పటివరకూ పదవికి దూరంగా వుండాలనీ, రాజీనామా చేయాలని నితీష్ కోరారు. కానీ ఆయన మాటలను తేజస్వి యాదవ్ బేఖాతరు చేశారు. రాజీనామాకు ససేమిరా అన్నారు. దీనితో నితీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇకపోతే బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా జేడీ బలం 71 సీట్లు కాగా ఆర్జేడీకి 83 మంది సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి ఎలా తెరపడుతుందో వేచి చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal helth: హీరో విశాల్ ఆరోగ్యంపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వివరణ

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments