Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడు ముందే అక్కతో ప్రియుడు రొమాన్స్, వెయ్‌రా బ్రదర్ అంది, అంతే.. కుప్పకూలిపోయాడు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (14:59 IST)
బర్త్ డే పార్టీకి ప్రియురాలిని పిలిచాడు. పార్టీ కదా... ఏదైనా అతి చేస్తాడేమోనని ఆమె తన తమ్ముడిని కూడా తోడు తెచ్చుకుంది. పుట్టినరోజు వేడుకలు చేసుకున్న తరువాత మద్యం సేవించడానికి కూర్చున్నారు. ప్రియురాలిని కంపెనీ ఇవ్వమని ప్రియుడు ప్రాధేయపడ్డాడు. ఇదంతా తనకు నచ్చదని వారించింది. కానీ ఎలాగోలా ఆమెను ఒప్పించాడు. కానీ ఆ పార్టీయే తనకు చివరి పార్టీ అని ఊహించలేకపోయాడు.
 
ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలోని సాహిల్, ఇంటి పక్కనే ఉన్న వర్షలు ప్రేమించుకుంటున్నారు. సంవత్సరం నుంచి వీరి ప్రేమాయణం సాగుతోంది. అక్క ప్రేమలో ఉందన్న విషయం తమ్ముడు ఆకాష్‌కు తెలుసు. కానీ తల్లిదండ్రులకు తెలియదు. 
 
నిన్న సాహిల్ బర్త్ డే. స్నేహితులందరినీ పిలిచాడు. తన ప్రియురాలిని పిలిచాడు. తన తమ్ముడిని వెంట పెట్టుకుని వెళ్ళింది. తక్కువ మంది మాత్రమే వచ్చారు. వారందరూ ఎవరికీ వారుగా వెళ్ళిపోయారు. కానీ సాహిల్ తన ప్రియురాలితో కలిసి మద్యం సేవించాలనుకున్నాడు. ప్లీజ్ ఒక్కసారి అంటూ ప్రాధేయపడి ఆమెను ఒప్పించాడు.
 
తమ్ముడు ఆకాష్, అలాగే సాహిల్ స్నేహితుడు అలీ కూడా కూర్చున్నారు. మద్యం సేవించిన తరువాత సాహిల్ రెచ్చిపోయాడు. రొమాన్స్ ప్రారంభించాడు. ముద్దులు పెట్టుకుంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
 
ప్రియుడే కదా అని కొద్దిసేపు ఊరుకుంది. తమ్ముడికి నచ్చజెప్పింది. కానీ అతడు అంతకుమించి శృతిమించడంతో తమ్ముడు ఊరుకోలేదు. ఆగ్రహంతో రగిలిపోయాడు. వర్ష కూడా తన ప్రియుడు చేష్టలకు తీవ్ర అసహనం చెంది బీరు బాటిళ్ళతో ప్రియుడు నెత్తిపై గట్టిగా కొట్టింది.
 
అతడు మీదకు వస్తుండటంతో... తమ్ముడూ అంటూ అతడిని పిలిచింది. ఆకాష్ మరికాస్త గట్టిగా కొట్టాడు. అంతే.. ప్రియుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments