Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో దయనీయస్థితి ... తోపుడు బండిపై తండ్రిని ఆస్పత్రికి తరలించిన బాలుడు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (11:05 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లో వైద్య సదుపాయాలు మరింత అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పడానికి ఈ దృశ్యం చాలు. అనారోగ్యంతో బాధడుతున్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే వారి వైపు నుంచి సరైన స్పందన లేదు. దీంతో తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు ఆరేళ్ళ బాలుడు తోపుడు బండిపై పడుకోబెట్టి తోసుకెళ్లారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీలో చోటుచేసుకున్న ఈ ఘటన నెటిజన్లను కంటతడిపెట్టిస్తుంది. ఈ ఘటన ను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. సింగ్రౌలీకి చెందిన షా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారోగ్యం ఎక్కువకావడంతో షాను ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆయన భార్య, ఆరేళ్ల కొడుకు ప్రయత్నించారు. 
 
అంబులెన్స్ కోసం ఆస్పత్రికి ఫోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన లేదు. నిరుపేద కుటుంబం కావడంతో ఆటోలో తీసుకెళ్లేంత సొమ్ము లేదు. ఏం చేయాలో తోచక చివరకు తోపుడు బండిపై షాను ఆస్పత్రికి తీసుకెళ్లాలని తల్లీకొడుకులు నిర్ణయించారు. ఇద్దరూ కలిసి షా ను తోపుడు బండిపై చేర్చారు. ఆ పై బండిని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments