Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ బే రిసార్ట్స్‌ వద్ద హైటెన్షన్... మీడియా సిబ్బందిపై శశికళ ప్రైవేట్ బౌన్సర్ల దాడి?

తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన నెంబర్‌గేమ్‌లో ఎలాగైనా నెగ్గేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం పావులు కదుపుతోంది. ఇందుకోసం చెన్నైకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్‌లో

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:46 IST)
తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన నెంబర్‌గేమ్‌లో ఎలాగైనా నెగ్గేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం పావులు కదుపుతోంది. ఇందుకోసం చెన్నైకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్‌లో తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను బంధించారు. ఈ ఎమ్మెల్యేలంతా బయటి వ్యక్తులతో మాట్లాడకుండా మొబైల్ జామర్లను ఏర్పాటు చేశారు. అలాగే, రిసార్ట్స్‌లోకి మీడియాతో పాటు ప్రైవేట్ వ్యక్తులెవ్వరినీ అనుమతించడం లేదు. 
 
ముఖ్యంగా ఈ రిసార్టులో కొత్తగా గదిని బుక్ చేసుకునేందుకు సైతం ఏ ఒక్కరినీ లోనికి వెళ్లనీయడం లేదు. దీంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున రిసార్ట్స్ బయట నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అతికష్టం మీద జాతీయ మీడియా ప్రతినిధి ఒకరు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా శశికళ శిబిరంలోని ఓ నేత అడ్డుతగిలారు. తాను ఏఐఏడీఎంకే నాయకుడిననీ... ఇది ప్రైవేట్ రిసార్టు అయినందున ఎవరినీ లోపలికి అనుమతించడం లేదని వాదించాడు.
 
దీనికితోడు అక్కడే కాపలాకాస్తున్న ప్రైవేట్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులను అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందిగా బెదిరింపులకు సైతం దిగారు. మరికొందరు అతిగా ప్రవర్తించి.. మీడియా సిబ్బందిపై దాడిచేశారు. రూమ్స్ బుక్ చేసుకునేందుకు కూడా ఎవరికీ అనుమతి లేనందున వెళ్లిపోవాలంటూ హెచ్చరిక ధోరణితో చెప్పారు. అంతేనా, ఇక్కడి దరిదాపులకు కూడా ఎవరు రాకుండా మోటార్ బైక్‌లు అడ్డంపెట్టి మరికొందరిని కాపలాగా ఉంచారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments