Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ప్రమాణ స్వీకార వేడుకకు బాంబు బెదిరింపు..

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (17:31 IST)
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకార వేడుకకు బాంబు బెదిరింపు వచ్చింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదవ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుక చెన్నై వర్శిటీ శతాబ్ది మండపంలో శనివారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ వేడుకకు అన్నిఏర్పాటు వేగంగా జరుగుతున్నాయి. 
 
ఈ స్థితిలో ప్రమాణ స్వీకారం చేసే స్టేజ్‌కి బాంబు పెట్టినట్టు పోలీసు శాఖకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల నిపుణుల సాయంతో తీవ్ర తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ ఎటువంటి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
 
మరో వైపు ఈ బాంబు బెదిరింపు ఇచ్చిన నాగర్‌కోవిల్‌కు చెందిన వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతని వద్ద పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. అయితే ఆ వ్యక్తి గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments