Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోఫోర్స్ స్కామ్ ఏమో.. బోఫోర్స్ గన్స్ అద్భుతం : మనోహర్ పారికర్

Webdunia
మంగళవారం, 26 మే 2015 (19:25 IST)
దేశంలో సంచలనం సృష్టించిన బోఫోర్స్ స్కామ్‌ సంగతి తనకు తెలియదనీ, కానీ, బోఫోర్స్ తుపాకీలు మాత్రం బాగానే ఉన్నాయనీ, పేలుతున్నాయని భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు.
 
నిజానికి మాజీ ప్రధాని రాజీవ్ పదవిలో ఉండగా జరిగిన బోఫోర్స్ స్కామ్ చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనిపై మరోమారు దేశ వ్యాప్త చర్చకు తెరలేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో, బోఫోర్స్‌పై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తనదైన శైలిలో స్పందించారు. బోఫోర్స్ కుంభకోణం సంగతేమో తెలియదు కానీ, బోఫోర్స్ గన్స్ నాణ్యత విషయంలో భేషుగ్గా ఉంటాయని అన్నారు.
 
స్వీడన్‌కు చెందిన బోఫోర్స్ గన్స్ నాణ్యతలో వాటికవేసాటి అని ఆయన అభిప్రాయపడ్డారు. మరి దేశం మొత్తం బోఫోర్స్ కుంభకోణం అంటుండగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం అది కుంభకోణం కాదని అంటున్నారని అడుగగా, దానిపై వ్యాఖ్యానించేందుకు పారికర్ నిరాకరించారు. దానిపై ఏమీ మాట్లాడుదలుచుకోలేదు కానీ బోఫోర్స్ గన్స్ మాత్రం అద్భుతమైనవని చెబుతానని ఆయన పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments