Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఆకాశంలో అద్భుతం : రక్తపుముద్దలా మారనున్న చంద్రుడు

Webdunia
బుధవారం, 26 మే 2021 (08:17 IST)
నేడు ఆకాశంలో అద్భుతం కనిపించనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. అయితే, మన దేశంలో ఇది పాక్షికంగానే కనిపించనుంది. ఈ చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. చంద్రుడు ‘సూపర్ బ్లడ్‌మూన్’గా కనిపిచంనున్నాడు. 
 
అంటే చందమామ నేడు రక్తపు ముద్దలా దర్శనమిస్తుందన్నమాట. అయితే, భారత‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు దీనిని వీక్షించే అవకాశం లేదు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలు, ఒడిశా తీరప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ గ్రహణం దర్శనిమిస్తుంది.
 
ఇక గ్రహణం మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్‌లో మొదలై సాయంత్రం 6.23 గంటలకు ముగుస్తుంది. నాసా ప్రకారం.. పూర్తి గ్రహణం.. అమెరికా, కెనడా, మెక్సికో, సెంట్రల్ అమెరికాలోని చాలా ప్రాంతాలు, ఈక్వెడార్, పశ్చిమ పెరు, దక్షిణ చిలీ, అర్జెంటినా దేశాల్లో కనిపిస్తుంది.
 
మన దేశంలోని అగర్తల, ఐజ్వాల్, కోల్‌కతా, చిరపుంజి, కూచ్ బెహర్, డైమండ్ హార్బర్, దిఘా, గువాహటి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, లుమ్డింగ్, మాల్దా, నార్త్ లఖిమ్‌పూర్, పారాదీప్, పాశీఘాట్, పోర్ట్ బ్లెయిర్, పూరి, షిల్లాంగ్ తదితర ప్రాంతాలతోపాటు నేపాల్, పశ్చిమ చైనా, మంగోలియా, తూర్పు రష్యాలలో గ్రహణం పాక్షికంగా కనిపించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments