డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

ఠాగూర్
బుధవారం, 23 జులై 2025 (17:15 IST)
ముంబై మహానగరంలో ఓ డెలివరీ బాయ్ గలీజు పని చేశాడు. లిఫ్టులో మూత్ర విసర్జన చేస్తూ నిఘా నేత్రానికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరంలోని స్థానిక విరార్ వెస్ట్‌లోని ఒక భవనం లిఫ్టులో మూత్ర విసర్జన చేశాడు. దీంతో సదరు బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌పై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత భవనం నివాసితులు ఈ సంఘటనను గుర్తించారు.
 
సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాల ఆధారంగా... డెలివరీ ఏజెంట్ తన ఎడమ చేతిలో పార్శిల్ పట్టుకుని లిఫ్టు లోపల కనిపించాడు. లిఫ్టులో కొద్దిసేపు అటుఇటు తిరిగిన అతడు.. ఒక మూలలో మూత్రవిసర్జన చేశాడు. ముంబైలోని విరార్ వెస్ట్‌లోని సీడీ గురుదేవ్ భవనంలో ఈ సంఘటన జరిగింది.
 
భవనంలోని నివాసితులు లిఫ్టులో మూత్రం ఉండటాన్ని గమనించి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్లింకిట్ జాకెట్ ధరించిన వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది. దాంతో నివాసితులు బ్లింకిట్ కార్యాలయానికి వెళ్లి నిందితుడిని గుర్తించారు. అక్కడ అతన్ని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దాంతో విరార్ వెస్ట్‌లోని బోలింజ్ పోలీస్ స్టేషనులో అతనిపై కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

తర్వాతి కథనం
Show comments