Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడ చూసినా డబ్బే డబ్బు... దేశ వ్యాప్తంగా బయటపడుతున్న లక్ష‌ల కొద్దీ పాత‌నోట్లు

ఎక్కడ చూసినా డబ్బే డబ్బు. దేశ వ్యాప్తంగా లక్షల కొద్దీ పాత రూపాయల నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్లకుబేరులు అడ్డంగా బుక్కైన విషయం తెల్సిందే.

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (17:15 IST)
ఎక్కడ చూసినా డబ్బే డబ్బు. దేశ వ్యాప్తంగా లక్షల కొద్దీ పాత రూపాయల నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్లకుబేరులు అడ్డంగా బుక్కైన విషయం తెల్సిందే. ప్ర‌భుత్వానికి ప‌న్నులు క‌ట్ట‌కుండా అక్ర‌మంగా దాచుకున్న డ‌బ్బుల‌ క‌ట్ట‌లు బ‌య‌ట‌కు తీస్తూ వాటిని మార్చుకునే క్ర‌మంలో పోలీసుల‌కి ప‌ట్టుబ‌డుతున్నారు. 
 
ఇప్పటికే దేశంలో ప‌లు ప్రాంతాల్లో భారీ డ‌బ్బు ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు కూడా ప‌లు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పాత‌నోట్ల క‌ట్ట‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ నల్ల కుబేరుడు ఢిల్లీ నుంచి గోర‌ఖ్‌పూర్ ప్రాంతానికి త‌ర‌లిస్తున్న రూ.96 ల‌క్ష‌ల రూపాయ‌లు విలువ చేసే పాత‌నోట్ల క‌ట్ట‌ల‌ను ఆనంద్ విహార్ బ‌స్ టెర్మిన‌ల్ వ‌ద్ద పోలీసులు స్వాధీనం చేసుకొని ఒక వ్య‌క్తిని అరెస్టు చేశారు. మ‌రోవైపు పంజాబ్‌లోని లుథియానా ప్రాంతంలో స్థానిక పోలీసులు రూ.45 ల‌క్ష‌ల విలువ చేసే 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను సీజ్ చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ శనివారం రూ.69 ల‌క్ష‌ల పాత నోట్ల క‌ట్ట‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు సమీపంలో ఓ కారులో ఈ డ‌బ్బును త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ సొమ్ము ఒంగోలుకు చెందిన ఓ వైద్యుడికి సంబంధించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అదేసమయంలో సాధారణ ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments