Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాపై నాకో డ్రీమ్‌ ఉంది... మరోసారి పట్టంకడితే డ్రీమ్ నెరవేరుస్తా : మనోహర్ పారీకర్

గోవా ముఖ్యమంత్రిగా గతంలో పని చేసి ఇపుడు భారత రక్షణ శాఖామంత్రిగా విధులు నిర్వహిస్తున్న మనోహర్ పారీకర్ తన మనసులో ఉన్న మాటను వెల్లడించారు. తనకు గోవా విషయంలో ఒక డ్రీమ్‌ ఉందని, గతంలో తాను అనుకున్నవి చేశానన

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (10:33 IST)
గోవా ముఖ్యమంత్రిగా గతంలో పని చేసి ఇపుడు భారత రక్షణ శాఖామంత్రిగా విధులు నిర్వహిస్తున్న మనోహర్ పారీకర్ తన మనసులో ఉన్న మాటను వెల్లడించారు. తనకు గోవా విషయంలో ఒక డ్రీమ్‌ ఉందని, గతంలో తాను అనుకున్నవి చేశానని, మరోసారి బీజేపీకి పట్టం కడితే ఆ డ్రీమ్‌ కూడా నెరవేరుస్తానని గోవా ఓటర్లకు హామీనిచ్చారు. 
 
వచ్చే యేడాది గోవాతో పాటు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారం చేపట్టింది. ఇందులోభాగంగా పనాజీలో జరిగిన ఓ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... 'సంతోష పట్టిక'లో గోవా వెనుకబడిందని, దానిని అమాంతంగా పెంచేయాలన్నదే తన కొత్త కల అని ఆయన చెప్పారు.
 
'మేం(బీజేపీ) సామాజిక రంగానికి బాగా పనిచేశాం. మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేశాం. కానీ, ఒకటి మాత్రం ఇంకా చేయాల్సి ఉంది. నాకు గతంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, సామాజిక రంగానికి సంబంధించి పనిచేయాలని ఒక కల ఉండేది. అది నెరవేరింది. కానీ, ఇప్పుడు అదే స్థాయిలో గోవాలో సంతోషాలు వెల్లివిరిసేలా చేయాలి. హ్యాపినెస్‌ ఇండెక్స్‌‌లో గోవాను ముందుకు తీసుకెళ్లాలి. ఇది చేయాలంటే మరోసారి బీజేపీకి అధికారం అప్పగించాలని కోరారు. 
 
'మీకు డబ్బు సంతోషాన్ని ఇవ్వదు. సంతోషకరమైన పరిస్థితుల గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని గురించి గోవా అసెంబ్లీలో 2001లో బడ్జెట్‌ ప్రవేశ​ పెట్టే సమయంలో నేను చెప్పాను. రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా లేనంతవరకు ఇక రాష్ట్రానికి అవసరమైనవి ఏవీ లేవని చెప్పలేం. ఇది చేయాలంటే నాకు మీ మద్దతు కావాలి' అని పారికర్‌ గోవా ప్రజలను కోరారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం