Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెర్సల్ వివాదం.. విజయ్‌కి కమల్ మద్దతు.. ఆ డైలాగులు తొలగించాల్సిన అవసరం లేదు

మెర్సల్ సినిమా వివాదంపై సినీ లెజెండ్ కమల్ హాసన్ స్పందించారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మెర్సల్' మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఇప్పటికే రూ. 150 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలోని క

BJP
Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (09:07 IST)
మెర్సల్ సినిమా వివాదంపై సినీ లెజెండ్ కమల్ హాసన్ స్పందించారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మెర్సల్' మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఇప్పటికే రూ. 150 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలోని కొన్ని డైలాగులు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లున్నాయని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీఎస్టీపై ఈ సినిమాలో ఉన్న డైలాగులపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోదీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్న ఈ డైలాగులను తక్షణమే తొలగించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో వ్యవస్థపై విమర్శలు చేసే హక్కు అందరికీ వుందంటూ విజయ్‌కి కమల్ హాసన్ మద్దతుగా నిలిచారు. అన్ని విధాలుగా సెన్సార్ అయిన తర్వాతే, ఈ సినిమా రిలీజ్ అయిందని ఆయన అన్నారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు వివాదాస్పదంగా భావిస్తున్న సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని కమల్ వ్యాఖ్యానించారు.
 
తమిళ సూపర్‌స్టార్ విజయ్ లేటెస్ట్ మూవీ మెర్సల్‌పై తమిళనాడు బీజేపీ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక పథకాలను హేళన చేయడంపై బీజేపీ మండిపడుతోంది. జీఎస్టీని, డిజిటల్ ఇండియా ప్రచారాన్ని తప్పుగా చూపించారని, ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపిస్తుందని తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందర రాజన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments