Webdunia - Bharat's app for daily news and videos

Install App

గో'మాత' కోసం చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం : సాక్షి మహారాజ్

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (12:01 IST)
గోమాత కోసం చంపడానికైనా.. చావడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్టు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ సాక్షి మహారాజ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, దాద్రీ ప్రాంతంలోని బిషాడా గ్రామంలో గోమాంసం తిన్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్నది.
 
దీనిపై సాక్షి మహారాజ్ స్పందిస్తూ ఎవరైనా తమ తల్లి (గోమాత)ను చంపేందుకు ప్రయత్నిస్తే, తాము మౌనంగా చూస్తూ ఊరుకోబోమని, చంపేందుకైనా, చావడానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ ఘటన విషయంలో యూపీ ప్రభుత్వ ద్వంద్వ విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు.
 
మరోవైపు... బీహార్ ఎన్నికల రాజకీయాల్లో సైతం బీఫ్ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. భారతీయులూ పశుమాంసం తింటారని ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ రామ్‌దేవ్ బాబా ఆయనను కంసునితో పోల్చారు. ఇప్పుడు లాలూ వంతు వచ్చింది. బాబా అమ్మే ఆయుర్వేద మందుల్లో పశువుల ఎముకలు కలిపినట్టు గతంలో వచ్చిన ఆరోపణలను లాలూ గుర్తు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments