Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో బీజేపీ సర్కారు.. మద్దతు పలికిన ఎన్‌పీఎఫ్‌, ఎన్‌పీపీ, ఎల్జేపీ

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాజకీయాలు ఊహించనిమలుపు తిరిగాయి. ఈ రాష్ట్రం కూడా బీజేపీ ఖాతాలోనే చేరిపోయింది. 4 స్థానాలున్న కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీపీ), ఒక స్థానమున్న

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (10:54 IST)
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాజకీయాలు ఊహించనిమలుపు తిరిగాయి. ఈ రాష్ట్రం కూడా బీజేపీ ఖాతాలోనే చేరిపోయింది. 4 స్థానాలున్న కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీపీ), ఒక స్థానమున్న మిత్ర పక్షం ఎల్జేపీ బీజేపీకి మద్దతు ప్రకటించాయి. మరో 4 స్థానాలున్న నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) కూడా పరోక్షంగా బీజేపీకి సపోర్టు చేసింది. అదే సమయంలో టీఎంసీకి చెందిన ఒకే సభ్యుడు, కాంగ్రెస్‌ నుంచి మరో సభ్యుడు ఆదివారం బీజేపీలో చేరారు. 
 
వీరి చేరికతో బీజేపీ బలం 21 (బీజేపీ)+4 (ఎన్పీఎఫ్)+4 (ఎన్పీపీ)+1 (ఎల్‌జేపీ)+1 (కాంగ్రె్‌స)+1 (టీఎంసీ) మొత్తం 32 సీట్లకు చేరింది. దాంతో మణిపూర్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈ మేరకు గవర్నర్‌ నజ్మా హెప్తుల్లాను బీజేపీ ఎమ్మెల్యేల బృందం కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కాగా, సోమవారం పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటామని బీజేపీ ప్రకటించింది. 
 
మొత్తం 60 స్థానాలున్న అసెంబ్లీలో 28 గెలుచుకుని కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు 3 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అయితే.. విపక్షాలు ఏవీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌ చక్రం తిప్పారు. ఆదివారం ఇంఫాల్‌లోనే మకాం వేసి ఆయా పార్టీలతో చర్చలు జరిపారు. ఎన్‌పీపీ మద్దతు సాధించడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments