Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆజం ఖాన్ తల తెగనరికి పార్లమెంట్ ద్వారానికి వేలాడదీయండి...

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (17:24 IST)
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు ఆజం ఖాన్ లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ రమాదేవి (బీజేపీ)ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్‌ బిల్లుపై చర్చ జరుగుతుండగా ఆజంఖాన్ మాట్లాడుతూ.. మీ కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలని ఉందని రమాదేవిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. కాగా, ఎంపీ రమాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్‌పై బీజేపీ నేత ఆఫ్తాబ్ అద్వానీ మండిపడ్డారు.
 
ప్యానెల్ స్పీకర్ రమాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్ తల తెగనరికి పార్లమెంట్ ద్వారానికి వేలాడదీయాలని కోరారు. రమాదేవిపై ఆజం ఖాన్ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని, అందువల్ల ఆజం తలను తెగనరకాలని, పార్లమెంటు ద్వారానికి వేలాడదీయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తద్వారా మహిళలను అవమానిస్తే ఏం జరుగుతుందో ఆజంఖాన్, అసదుద్దీన్ ఓవైసీ వంటి వారికి తెలిసొస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
పార్లమెంట్ వేదికగానే ఓ మహిళను అవమానిస్తే ఏం జరుగుతుందో ఈ లోకానికి తెలియజెప్పాలన్నారు. ముఖ్యంగా, మహిళలను అవమానపరిస్తే ఇకపై ఎంతమాత్రమూ ఉపేక్షించబోమని ఆఫ్తాబ్ హెచ్చరించారు. 
 
ఆజంఖాన్ తొలుత జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు రమాదేవిని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖండించాల్సిన విషయమన్నారు. ఈ పెద్దమనిషికి పిచ్చెక్కిందని తాను ఇది వరకే చెప్పానని గుర్తుచేశారు. దేశానికి హానికరంగా తయారవుతున్న పిచ్చి కుక్కను చంపాల్సిందేనని ఆఫ్తాబ్ తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments