Webdunia - Bharat's app for daily news and videos

Install App

గో సంరక్షణ పేరుతో హత్య.. బీజేపీ నేత అరెస్టు

గో సంరక్షణ పేరుతో హత్యలు ఏమిటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించిన రోజే పశుమాంసం తీసుకెళుతున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని హత్య చేసిన విషయం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (13:15 IST)
గో సంరక్షణ పేరుతో హత్యలు ఏమిటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించిన రోజే పశుమాంసం తీసుకెళుతున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని హత్య చేసిన విషయం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. గో సంరక్షణ పేరుతో హత్యలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. 
 
గతవారంలో తన కారులో మాంసం తీసుకు వెళుతున్నాడని ఆరోపిస్తూ, ఓ వ్యక్తిపై దాడి చేసి కొట్టి చంపడమే కాకుండా, కారును దహనం చేసిన కేసులో రామ్‌గఢ్ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నిత్యానంద మహతోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్థానిక పార్టీ నేత పప్పూ బెనర్జీ, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. 
 
అలీముద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసి దారుణంగా కొట్టి, అతని మారుతి వ్యాన్‌ను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిత్యానంద ప్రోద్బలంతోనే అల్లరిమూక రెచ్చిపోయినట్టు తమ వద్ద వీడియో సాక్ష్యం ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ హత్య ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని అనుమానిస్తున్నామని, నిత్యానందకు, అలీముద్దీన్‌కూ పాత గొడవలు ఉన్నాయని తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments