Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్మీత్‌ను వెనకేసుకొచ్చిన సాక్షి మహారాజ్.. వేధిస్తున్నారట..

రేప్ కేసులో నిందితుడైన డేరా సచ్ఛా సౌదా సారథి గుర్మీత్ రాం రహీం సింగ్‌ను వివాదాస్పద ఎంపీ సాక్షి మహారాజ్‌ వెనకేసుకొచ్చారు. కోట్లాది మందికి ఆరాధ్యుడైన వ్యక్తి దోషి ఎలా అవుతాడని ప్రశ్నించాడు. అలాంటి వ్యక్

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (11:35 IST)
రేప్ కేసులో నిందితుడైన డేరా సచ్ఛా సౌదా సారథి గుర్మీత్ రాం రహీం సింగ్‌ను వివాదాస్పద ఎంపీ సాక్షి మహారాజ్‌ వెనకేసుకొచ్చారు. కోట్లాది మందికి ఆరాధ్యుడైన వ్యక్తి దోషి ఎలా అవుతాడని ప్రశ్నించాడు. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేసిన మహిళ చెప్పేది సత్యమేనని ఎలా విశ్వసించడం అంటూ సాక్షి మహారాజ్‌ వ్యాఖ్యానించారు.

కోర్టు తీర్పు రాగానే ఆయన మద్దతుదారులు సృష్టించిన విధ్వంసం గురించి ప్రశ్నించగా, ఇదే ప్రశ్న జుమ్మా మసీదు షాహీ ఇమామ్‌ను అడగగలరా ? ఆయనపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా అని ఎదురు ప్రశ్నిస్తూ, గుర్మీత్‌ సాధారణ వ్యక్తి అయినందుననే ఆయనను వేధిస్తున్నారని సాక్షి మహారాజ్‌ ఆరోపించారు. 
 
సాక్షి మహారాజ్‌ వాదనను ఆయన పార్టీలోని చాలా మంది సమర్థించేందుకు సంసిద్ధంగా లేరు. హర్యానా మంత్రి కైలాశ్‌ విజయవర్గీ స్పందిస్తూ సాక్షి మహారాజ్‌ అభిప్రాయాలతో పార్టీ ఏకీభవించడం లేదని, ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం, ప్రాణ నష్టం జరిగిన తీరును తప్పుపడుతున్నట్టు తెలిపారు.

ఇక ఎప్పుడూ సంచలనాలకు మారు పేరుగా నిలిచే రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయం వ్యక్తంచేస్తూ సాధువులకు రాజకీయవేత్తల నుంచి వారి ఆశ్రమాలలోని వారి నుంచే పెద్ద ముప్పు ముంచుకొస్తోందని, వారిని జైళ్లకు పంపి ఆశ్రమ ఆస్తులను చేజిక్కించుకోవాలన్న ధోరణి పెరిగిపోతోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments