ధ్వంసం చేయడమే బీజేపీకి తెలుసు : రాహుల్

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (11:11 IST)
భారతీయ జనతా పార్టీకి ధ్వంసం చేయడమే తెలుసని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే తెలుసన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అనుకున్నంత వేగంగా లేదన్న వార్తలతో రాహుల్ గాంధీ శనివారం ఓ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే కానీ కొత్తగా దేనినీ నిర్మించే సత్తా లేదని ఆరోపించారు. 'బీజేపీ ప్రభుత్వం దేనినీ నిర్మించలేదు. దశాబ్దాల తపన, విశేష కృషితో నిర్మించిన కట్టడాలను కూల్చడం మాత్రమే చేయగలదు' అని రాహుల్ ట్వీట్ చేశారు.
 
"బీజేపీ సర్కారుకు నిలబెట్టడం తెలియదు. తెలిసిందల్లా ధ్వంసమే. దశాబ్దాలుగా కష్టపడి, మక్కువతో నిర్మించుకున్న వాటిని కూలగొట్టడం ఒక్కటే ఆ పార్టీకి తెలుసు. ఆర్థిక మాంద్యంతో పాటు ఆటో, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, తయారీ రంగాలు కుదేలు కావడం బీజేపీ పనితీరుకు నిదర్శనాలు" అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments