Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ ద్వారా పాకిస్థాన్ అమ్మాయితో బీజేపీ నేత నిఖా

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (15:29 IST)
పాకిస్థానీయులను బద్ధ శత్రువులుగా భారతీయ జనతా పార్టీ నేతలు పరిగణిస్తారు. అలాంటి నేతల్లో ఒక నేత కుమారుడు పాకిస్తాన్ అమ్మాయిని వివాహం చేసుకోనున్నాడు. ఆ అమ్మాయిని ఆన్‌లైన్ ద్వారా నిఖా చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జౌన్పూర్ జిల్లాకుచెందిన బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ కుమారుడు మహ్మద్ అబ్బాద్ హైదర్ పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన అంగ్లీష్ జహ్రాను వివాహమాడనున్నారు. 
 
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదాల కారణంగా వరుడు షాహిద్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. దానికితోడు వధువు తల్లి యాస్మిన్ జైదీ అనారోగ్యంతో ఐసీయులో చేరడం పెళ్లికి మరింత ఆటంకాలుగా మారాయి. దీంతో పెళ్లి వేడుకను ఆన్‌లైనులో నిర్వహించాలని షాహిద్ నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూతురు తరపువారు కూడా అంగీకారం తెలపడంతో ఆన్‌లైనులోనే పెళ్లి తంతుని ముగించారు. 
 
గత శుక్రవారం రాత్రి ఆన్‌లైనులో నిఖా పూర్తి చేసుకున్నారు. ఇక్కడి నుంచి షాహిద్ కుటుంబ సభ్యులు, లాహోర్ నుంచి వధువు కుటుంబం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహంపై షియా మత పెద్ద మౌలానా మహఫూజుల్ హసన్ ఖాన్ స్పందించారు. ఇస్లాంలో నిఖాకు స్త్రీ అంగీకారం చాలా ముఖ్యమని, తన సమ్మతిని ఆమె మౌలానాకు తెలియజేస్తుందని చెప్పారు. ఇరువైపుల మౌలానాలు కలిసి వేడుకను నిర్వహించగలిగినప్పుడు ఆన్‌లైనులో నిఖా సాధ్యమవుతుందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments